మలుపు
శీర్షిక : మైలురాయి
కవిత సంఖ్య :
ఆటవికతలను అధిగమించి
నాగరికతలోకి అడుగులు వేస్తూ
నడిచిన మానవునికి ఎదురైన
అనుభవాలన్నీ బాల్యపు పొత్తిళ్లే ....
నిత్యజీవన సమరంలో కూడా
అడుగడుగున వేర్వేరు రూపాలైనా
ఎదురయ్యే కష్టనష్టాల కాలాలను
అనుభవించి అధిగమిస్తే గానీ
ఆవిష్కరించుకోలేము ఎప్పటికప్పుడు
నూతనత్వం.....
బాల విద్యార్థి బతుకు భారం మోసే
జీవన బాటసారి కావాలంటే సంధి
కాలాలను సంస్కరించుకోవాల్సిందే
లార్వానుండి వెలువడే సీతాకోకచిలుకలా ...
ప్రతి పనిలో ఫలితాలు చేరుకోవాలంటే
ప్రణాళికల నుండి అమలు దశలు చేరి
తుది రూపం తీర్చి దిద్దుకోవాలంటే
తప్పదు ప్రసవ వేదనల పరితపనలు ....
ఆశలేని జీవితం శ్వాసలేని శవమన్నట్టు
ఆశలగమ్యాలకు ఆశయాల గమనాలతో
విజయాలను ముద్దాడిన ప్రతి ప్రయత్నం
చక్కని మలుపే...
జీవన ప్రయాణంలో ఓ మైలురాయే
No comments:
Post a Comment