Monday, March 6, 2023

సప్త వర్ణ రీతి తేది : 19-09-2022 శీర్షిక : కవిత్వం ....

 సప్త వర్ణ రీతి 

తేది : 19-09-2022
శీర్షిక : కవిత్వం .... 
కవిత సంఖ్య : 989

అందమైన పొద్దుపొడుపులా 
అమరిన  ప్రారంభం ... 
ఆత్మీయతగా హృదయంలో 
అనితరమై పలకరించగ  .... 

పదం పదంలో మంజీరంతో  
పదబంధాలలో భావము పలికి  
దారి చూపే మార్గదర్శిగా నిలిచి 
దరిచేర్చుకునే బంధువ్యయింది  ... 

మార్పుకు ఓంకారమై వెలుగుతూ  
మనలో ఒకరిగా ఒదిగిపోయి  ... 
కథనంలో చైతన్యం నింపి 
పాఠకులను ఆలోచింపచేసింది ... 

సంఘం పట్ల బాధ్యత కలిగి 
సమ దృష్టిని సారిస్తూనే   .... 
సమస్యలను చంకనేసుకుని 
పరిష్కారాన్ని పట్టుకోగలిగింది ... 

అంశమేది సృషించినా సరే 
ఆయువు పట్టును  పట్టుకుని  .. 
సప్తవర్ణాల సింగిడిలో ఇముడ్చుకుని  
చదువరులను మమేకం చేసింది  .... 

సాంతంగా  ప్రాణ ప్రతిష్ట గావించి 
సంతులితంగా శీర్షికనందించి ... 
ముప్పిరిగొనే సమస్యేదయినా 
ముదావహమైన ముగింపు చూపింది  ... 

No comments:

Post a Comment