చిత్ర కవిత
తేది :18-10-2022
శీర్షిక : నాడు - నేడు విద్య ...
ఆనాడు ...
గురువంటే పరమ గురుతరమై
గుడిసెల్లోనో పాకల్లోనో జరిగినా
చదువుల జాతరకు తరిలేది
కాలి నడకల కణికట్టుగా బాలురంతా ....
పడరాని కష్టాల పాకులాడినా
పరకో అణానో ఫీజులంటేనే
ఇంటిల్లి పాదికి ఇక్కట్లే ...
చెల్లింపుల కష్టాలు చేటంత ...
ఆడుతూ పాడుతూ
అయిదారు చదివినా చాలు ...
పదిమందికి బతుకులీయగలిగే
పంతులయ్యే పతారా ఆనాడు ...
ఈనాడు ....
పరంధాముని తూకంలో
రాధమ్మ తేలసీదళమోలే
చదువులమ్మ బరువు ముందు
లక్ష్మమ్మ నిలువ చాలకపాయె...
బుడిబుడి పిల్లల బడి చదువులు
భారమాయె పెద్దలకు ఈనాడు ...
సకల సౌకర్యాలు హారమోలే
అందించినా అ ఆ లు కూడా గగనమే ...
కోట్లల్లో నోట్ల కట్టల మూటలు
వెచ్చించిననూ బూట్లు బాగులేనాయె ..
కలిమాయాల కరెన్సీ నోట్లన్నీ కలిసి
కాన్వెంటు చదువుల సమఉజ్జీ
కానేరక ....
లక్షలు కుమ్మరించినా
అక్షరజ్ఞానాల కరువులు
మోత బరువులే కానీ
కూత రాతలన్నియు హుళక్కే ...
విజ్ఞానములనెల్ల వీధిపాలు జేసే
వింతగ... పాశ్చాత్యము జొచ్చి
వినయమెరుగని విద్యలెన్నయినను
విలువు శూన్యములై వెలగబట్టే ఈనా డు .....
No comments:
Post a Comment