Tuesday, March 7, 2023

బాలల గేయం తేది : 15-10-2022 శీర్షిక : బడి బాట

 బాలల గేయం 

తేది : 15-10-2022
శీర్షిక :  బడి బాట 
కవిత సంఖ్య : సహస్రాధికం 

కపటమెరుగని బాలల్లారా 
కల్మషమెరుగని జీవుల్లారా 

కువ కువ పక్షులు పలకంగానే
దబ దబ మీరు లేవండి… 

అమ్మానాన్నల అందుకోండి  
తోబుట్టువులకు తోడవ్వండి 

గణగణ గంటలు మోగంగానే
బాలలు మీరు బడికి రండి.... 

బుడి బుడి అడుగుల నడకలతో
బిర బిర పరుగులు తీయండి… 

బిల బిలమంటూ బడి చేరాక 
కళకళలాడుతూ ఉండండి… 

కిల కిల నవ్వుల మోములతో
గలగల పాఠం చదవండి…. 

చిరు చిరు ఆటలు నేరవండి 
ఆరోగ్యాలను పదిలపరచండి ... 

పాటలు చక్కగా నేరవండి 
కోకిలలా  మీరు పాడండి....  

గురువుల మాటలు వినరండి 
గురుతర మార్గం నడవండి… 

ఇంటికిచ్చిన వ్రాత పనులను 
కంటికి నప్పేట్టు  వ్రాయండి...  

బంటుల్లా మీరు కష్టించండి
బతుకు బాటలో రాజై పోండి .... 

No comments:

Post a Comment