Monday, March 6, 2023

స్వేచ్చాంశం గతి : 5/6/5/6 గజల్

 స్వేచ్చాంశం 

గతి : 5/6/5/6

ఓట్లల్లొ ప్రతిగడపా మొక్కెదరు నాయకులూ
గెలిచాక గడపలోకి రానియరు నాయకులూ 

ఎన్నికకు లెక్కలేని బాసలెన్నొ చేసెదరు
గెలిచాక దులుపుకునీ తిరిగెదరు నాయకులూ

అందరికి చదువుసంధ్య రాకుండా
చూస్తారూ
అణగదొక్కి అందలాలు పొందెదరు నాయకులూ

స్వార్థాల సంచులన్నీ నింపుకొన చూస్తారూ
అవినీతి లంచగొండి శ్వాసిస్తరు
నాయకులూ

సుద్దులూ గద్దెలకే పరిమితం చేస్తారూ
వద్దన్న రాజులాగ చేసెదరు నాయకులూ


No comments:

Post a Comment