Tuesday, March 7, 2023

ప్రత్యేక కవిత తేది 25-10-2022 శీర్షిక : అసలైన దీవాలి

 ప్రత్యేక కవిత 

తేది 25-10-2022
శీర్షిక : అసలైన దీవాలి 

అన్నీ మంచి శకునములే 
అసలైన దీపావళి వేడుకకు 
ఆసరా అయ్యాయి వరుసగా ... 
అది ఇది అని తేడా లేకుండా ... 
మంచితనం... శాస్త్రసాంకేతికత ... 
ఆటలు .... 

మంచితనంతో మనగలమని 
మరోసారి నిరూపణ ....వందలేండ్ల 
వలస పాలనలతో చిన్నాభిన్నం 
చేసిన తెల్ల తోలు మందాలకు ... 

కనిపించని క్రిమి కంటకమో... 
రష్యా ఉక్రెయిన్ యుద్ధనీడల గడ్డుకాలమో ... 
ఆర్ధిక అస్థిరతల కొట్టుమిట్లాటలతో 
కోలాటమేస్తున్న గడ్డు కాలపు లండను 
పార్లమెంట్ కు మంచి తనపు
భారత మూలాల ఋషి సునాక్ 
బహులెస్సగ  పెద్ద దిక్కాయే ఈనాడు ... 

ఓడలు బండ్లు అవుతాయి...  
బండ్లు ఓడలు అవుతాయన్నదానికి 
ప్రత్యక్ష ఉదాహరణ.... అరవయ్యిల్లో 
సైకిళ్లతో సర్దుకుంటూ అరవ కష్టాల 
హరిగోసలెదుర్కొన్న మన ఇస్రోనే   ... 

నేడు ప్రపంచాన్ని శాసించే స్థాయిగా ... 
పెద్ద దిక్కయ్యి పెద్దన్న పాత్రతో 
36 ఉపగ్రహాలను విజయవంతంగా 
కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు ....వేల కోట్ల 
కాంట్రాక్టును సైతం చేజిక్కించుకుంటూ ... 

చెడుకు వేగమెక్కువ...  మంచికి 
నిదానమెక్కువ ...అంటే ఇదేనేమో .... 
ఎన్నో ఆటలను ఒంటిచేత్తో గెలిపించి
పేరు ప్రఖ్యాతులు మూటగట్టుకున్నా 
ముచ్చటగా  ఒంటరయ్యారు ఈనాడు ... 
ఒకటి రెండు కుంగుబాట్లతో ...కోహ్లీ ... 

అసలైన గెలుపుతో అల్లకల్లోలమే 
సృష్టించి అందరి మనసులు గెలుచుకుని 
అసలైన దీపావళిని కానుకగా ఇచ్చాడు 
దాయాదులపై దంచికొట్టి గెలిచి .... 
సప్తవర్ణాల కేళి దీపావళి ముందురోజు ... 
 

No comments:

Post a Comment