పొద్దుగాల
తేది : 25-10-22
శీర్షిక : మా ఇంటి దేవత
చిన్నోని రాగం సిత మందారమవగానే
చిలుక పలుకులకన్నా ముందు
చిర్రుబుర్రు చిమ్మటల రాగలకన్నా ముందే
చిత్రంగా తెలివయింది ....
అప్పుడే కన్నంటుకున్న అమ్మ
అన్యమనస్కంగానే మత్తు
వదిలించుకుని....
అంబారవములు విని పాలు పిండే
పని గుర్తొకు తెచ్చుకుంది ....
కాలానికి కాళ్ళొచ్చి పరుగెత్తినట్టే
ఇంటిపని వంటపని కానిచ్చేసి
ఇగురంగా అందరికి సద్ది ముల్లెగట్టి
పొద్దుతో పోటీపడి అవసరాలు తీర్చేస్తుంది ...
గడియ రికాము లేకుండా
గడియారంలో అలారంలా
అందరి పనులు అదే సమయానికి
అందిపుచ్చుకుంటుంది నిత్యం ...
అయ్య పొలం పోవాలన్నా ...
అక్క నేను బడికి వెళ్లాలన్నా ...
అమ్మ పచ్చ జండా ఊపితేనే ...
అందుకే అమ్మ మా ఇంటి దేవత ...
No comments:
Post a Comment