Tuesday, March 7, 2023

నరకాసురుడు వధ శీర్షిక : గుణపాఠం ...

 నరకాసురుడు వధ

శీర్షిక : గుణపాఠం ... 

సహేతుకమైన తార్కికం 
సంస్కారవంతమైన సంప్రదాయం 
సారవంతమైన ఆధ్యాత్మికం 
సాదృశ్యమే అడుగడుగున హైందవం .... 

అవనిమాత పుత్రుడైనను 
అరిషడ్వర్గాలకు అతీతుడు 
కాకపోతే .. తప్పదు చెల్లించక 
తగిన మూల్యమనే సందేశం ... 

అలవికాని అంధకారపు బాధలు 
అధిగమించాలంటే 
అంబరాన్నంటే సంతోషాలు పంచే 
దీప జ్యోతులే మనకు ఆశాజ్యోతులు... 

యుగాల తరబడి జరుపుకుంటున్న 
ఉత్తుంగ తరంగ ఉత్సవం...  
సజ్జనుడైన శ్రీరాముడు 
అయోధ్య చేరిన స్వాగతం ... 

కారణజన్ములైన  సత్యా శ్రీకృష్ణులచే 
సుర నర గంధర్వుల ఉసురులు  
పోసుకున్న నరకుని వధ చరితం ...  
కలియుగ కంఠకులకు కావాలి గుణపాఠం ... 

No comments:

Post a Comment