Monday, March 6, 2023

దసరా తేదీ : 05-10-2022 శీర్షిక : విజయదశమి

 దసరా 

తేదీ : 05-10-2022
శీర్షిక : విజయదశమి 

తపో ధనుల  తండ్లాటలతో 
మహా ఋషుల త్యాగాలతో 
వేద వేదాంగాలకు నిలయమై
పురాణ ఇతిహాసాలకు పుట్టినిల్లై  
ఉపనిషత్తులు కావ్యాలకు ఆలవాలమై 
సనాతన సాంప్రదాయాలతో పునీతం  .... 
పుణ్యభూమి నా మాతృదేశం  .... 

తెలియని బాల్యంలో తెలివిగ 
సెలవులని  సంబరపడుతూ 
ఆటపాటల ఆత్మీయులతో 
బంధు మిత్రులతో బలాదూరే .... 

ఒకటొకటిగా అడుగులేస్తూ 
ఒద్దికగా జీవితంలో నేర్చుకుంటే 
సంప్రదాయాల సందళ్ళలో 
నిబిడీకృతమైన ఆధ్యాత్మికతలే .... 

అలవికాని ఆశలకు మనసు 
అంకురమైనప్పుడు... బుద్ది 
చెప్పే సుద్దులు వినకుంటే 
సద్దు మనుగు...అజమాయిషీతో ..

దైత్య వంశజుడు మహిషాసురుడు 
మరణం లేని జీవనమంటూ 
విధికెదురేగి వింత కోరికలతో ...  
విధాతచే అనుగ్రహింపబడె... 

వరగర్వితుడై ఇంద్రపదవి 
చేపట్టగా ... ముక్కోటి దేవతలు 
ఒక్కటై త్రిమూర్తులకు మొరపెట్ట...  
శక్తులన్నీ ధారబోసే సింహవాహినికి ...

తొమ్మిది రోజులు అహోరాత్రులు 
పోరాడి ... పదవ రోజు విజయమందే . 
ఆ రోజే విజయ దశమిగా సంప్రదాయమై 
సన్నుతించబడె ...సర్వజనులచే...దసరాగా 

No comments:

Post a Comment