అమ్మ రౌద్రం కరుణ
05-10-2022
శీర్షిక : మహిషాసురమర్దిని
అమ్మ ఎవరికైనా అమ్మే ...కరుణా
కటాక్షాలు కురిపించి ఆదరించు ...
అయినా గీత దాటితే కోత పెట్టడానికైనా
వెనకాడని రౌద్రం కూడా అమ్మ సొంతం ...
అమ్మలగన్నయమ్మ చాలా పెద్దమ్మ
ప్రేమానురాగాలకు పెట్టింది పేరు
శిష్టరక్షణలు శీఘ్రముగా చేసేటి
చిన్మయ రూపిణి చిద్విలాసాని
దురిత క్షయములను దూరం చేయగా
దుర్గుణములు చీల్చి చెండాడగా
దుర్గ దేవిగా అవతరించే శక్తి స్వరూపిణి
కాళీమాతగా.... భద్రకాళి మాతగా ....
విధికెదురేగుతూ వింత కోరికలతో
విపరీతమైన వరములు బడసి
లోకాలను అతలాకుతలం చేసే
దుష్టులను సంహరించ అవతరించే ....
తెలియక చేసే తప్పులను ... తల్లిలా
ఆదరిస్తూ అక్కున చేర్చుకుంటూ ...
మదమాత్సర్యములతో కన్నూమిన్నూ
కానని కంటకులను ఏరిపారేసే మహిషాసురమర్దిని ...
No comments:
Post a Comment