ఆశావాదం
తేది: 12-10-2022
శీర్షిక: సంక్షేమం - కళ్యాణం
కవిత సంఖ్య : 170+4
దివారాత్రుల తేడా మరిచి
బ్రతుకు శ్వాసలకు పందిరై
అభివృద్ధికి ఆధారంగా నిలిచి
ప్రగతికి పట్టుకొమ్మగ ఊరేగు...
తప్పటడుగుల తిప్పలు దాటి
ఊహ తెలిసి ఊరేగుతున్నప్పటి నుండి
లోకం పోకడలు గమనిస్తూనే
గమనం చేస్తున్నాను ....
వేటకెళితే గాని యాట దక్కదన్నట్టు
ఏ కొందరో తప్ప అందరూ ఆశావాదాన్ని
నెత్తికెత్తుకుని... తప్పటడుగు లను
సరిదిద్దుకుంటూ ... అడుగులు వేస్తూ
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నవారే ...
మడిసన్నవాడికి కూసింత
కళాపోషనుండాలన్నట్టు...
ఆశలేని జీవితం శ్వాసలేని కళేబరమే...
కొందరివి వేగంగా తీరిపోతుంటే ...
ఇంకొందరివి నింపాదిగా అడుగులేస్తవి....
మనసున్న మనిషయినా ...
స్వప్నికమైన సంస్థ గాని ...
ధర్మమెరిగిన దేశమైనా ....
ఆశావాదాన్ని హత్తుకుంటేనే
మానవాళికి సంక్షేమం ...
జీవరాశి కళ్యాణం ..
No comments:
Post a Comment