Monday, March 6, 2023

జగజ్జనని శీర్షిక : తేది: 30-09-22 మినీ కవిత

 జగజ్జనని 

శీర్షిక :  సర్వతేజో సుసంపన్నం 
తేది: 30-09-22

బోళా బాలాగా ఇచ్చిన  బ్రహ్మ వరాలకు 
బలసంపన్నుడై విర్రవీగే మహిషాసురున్ని 
స్థితికారుడైన శ్రీహరి సలహాలతో 
ముగ్గురమ్మలను మూలపుటమ్ముగా 
ఏకం కమ్మని కోరిన దేవతలు... 

సాకార నిరాకార, సగుణ, నిర్గుణ పరబ్రహ్మ 
స్వరూప. ఏకరూప అయిన తల్లి , 
దేవకార్యసిద్ధి కోసం సర్వతేజసుసంపన్నమై
దుష్ట సంహారార్థమై జగజ్జననిగా అవతరించినది ... 

No comments:

Post a Comment