కవన రవళి - 14-10-22
చిత్ర కవిత
శీర్షిక : కబోది ....
కృతమూ కాదు ... ద్వాపరమూ కాదు
స్వచ్ఛతే తలమాణికమై ...
తాగుతున్నాడనుకుంటే పొరపాటే ...
కలిమాయల ఛాయలు సోకని
మతి చెదిరిన కబోదైయుండాలి ....
స్వార్థాలకు సంకేతాలుగా పాలిథీన్లు
అలసత్వాలకు ఆనవాళ్లుగా కాలుష్ యాలు
ఆవురావురంటున్న అనకొండలుగా
పట్టణాల కంచెలై పహారా కాస్తుంటే ....
కంటపడ్డ ప్రతీది కావాలనీ కొనుక్కుంటూ
ఇంటపడ్డ వ్యర్థాలను అవనంతా నింపేస్తూ...
ఇగురవంతుడననుకుని కితాబిచ్చుకుని
సంబరాల సందడిలో మునిగాడు..మనిషి
క్రమశిక్షణలను కాలతన్నిన పాపానికి
ఉర్వి మీది ఉమాపతి సహజ జలాలను తాగలేక
జనావళి అంతా కొట్టుమిట్టాడుతున్నా ...
మన్నుతిన్న పాములా ప్రజలు ప్రభుత్వాలు ....
చర్యకు ప్రతిచర్యల సహజంలా
మానవాళి అలసత్వాలకు మహీతలం
కంట నీరు పెడుతున్నా... పట్టని
నాయకులు... స్వచ్చంద సంస్థలు ....
కలపండి ఇకనైనా తలోచెయ్యి
కదిలిద్దాం కొంతమందినైనా
ఒళ్ళు విదిల్చి కళ్ళు తెరవండని...
కాలుష్యాల కబంధ హస్తాలనుండి విముక్తికై ...
No comments:
Post a Comment