చిత్ర కవిత (బ్రహ్మ జెముడు )
తేది 25-10-2022
శీర్షిక : గెలుపు సంతకం
కవిత సంఖ్య : సహస్రాధికం
ప్రకృతి ఎంత విచిత్రమో
పంచును సదా ఆనందం ...
పచ్చని తరువుల వాయువైనా ...
పారే సెలయేటి గలగలలైనా ...
పట్టుకుంటే గుచ్చుకునే కొమ్మైనా ...
మనిషంతా మొరటయినా
మనసు మాత్రం సుతిమెత్తనలా
ఒళ్ళంతా ముళ్ళు పరుచుకున్నా
తుళ్ళింతల కుసుమ శోభలే ....
ఎడారి మొక్కకు ...
కష్టాలను తాము నిండు మనసుతో భరిస్తూ
కనిపెంచిన పిల్లలకు మాత్రం
కలకాలం సుఖాలనందిస్తున్న
కన్నప్రేమల అమ్మానాన్నలలా ... వందలేండ్ల వలస పాలనలతో
కంటిలో కంటకమై మనల్ని చిన్నాభిన్నం
చేసిన తెల్ల తోలు మందాలకు ...
మంచితనంతో కూడా మనగలిగి
మనమూ ఏలగలమని నవ్వుల పూవులు
పంచగలమని మరోసారి నిరూపణలే
మన సంస్కృతి సంప్రదాయాలతో ....
కనిపించని క్రిమి కంటకమో... కనిపించే
రష్యా ఉక్రెయిన్ యుద్ధనీడల గడ్డుకాలమో ...
ఆర్ధిక అస్థిరతల కొట్టుమిట్లా టలతో అట్టుడికి
కోలాటమేస్తున్న గడ్డు కాలపు లండను
పార్లమెంట్ కు... మొదట నిరసించినా ...
వేచిన మంచి తనపు భారత మూలాల
ఋషి సునాక్ యే బహులెస్సగ
పెద్ద దిక్కాయే బహుమతిగా ఈనాడు ...
No comments:
Post a Comment