బతుకమ్మ పండుగ
తేదీ 01-10-2022
శీర్షిక : సప్త వర్ణ శోభితం
సంఖ్య: 1000
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
వలసవాద పాలన్లో ఉయ్యాలో
వజ్రాయుధమాయె ఉయ్యాలో
అతివలంతొక్కటై ఉయ్యాలో
పిక్కటిల్లే తీరుగా ఉయ్యాలో
శక్తిపూజ చేసిరి ఉయ్యాలో
శరన్నవరాత్రుల్లో ఉయ్యాలో
బాధలన్నీ తెలిపి ఉయ్యాలో
బతుకునియ్యిమనె ఉయ్యాలో
అమ్మవారిని కొలిచె ఉయ్యాలో
అనువైన తీరునా ఉయ్యాలో
తీరొక్క పూలతో ఉయ్యాలో
శోభిల్లె నిండుగా ఉయ్యాలో
తీర్థమోలే ఒక్కటయ్యి ఉయ్యాలో
పాటలే కట్టిరి ఉయ్యాలో
బంగారు తంగేళ్లు ఉయ్యాలో
బహు చక్క బంతులు ఉయ్యాలో
మురిపాల చామంతులు ఉయ్యాలో
ఇంపైన గునుగులు ఉయ్యాలో
ఇల మెరయు పట్టుకుచ్చులు ఉయ్యాలో
చిత్రంగ గుమ్మడి ఉయ్యాలో
చిరు ఉద్రాక్షలు ఉయ్యాలో
చిట్టి గోరంటలు ఉయ్యాలో
పచ్చన్ని బీరలు ఉయ్యాలో
పావురంగ కట్లలు ఉయ్యాలో
రంగుల పూలన్నీ ఉయ్యాలో
రమ్యంగా పేర్తురు ఉయ్యాలో
ఘనమైన గౌరమ్మను ఉయ్యాలో
అందునా చేర్తురు ఉయ్యాలో
పట్టుబట్టలు కట్టి ఉయ్యాలో
పడతులంతా జేరి ఉయ్యాలో
ఆత్మీయంగ పాడేరు ఉయ్యాలో
ఆమని కోయిలలై ఉయ్యాలో
గౌరమ్మ పాటలు ఉయ్యాలో
తొమ్మిదో రోజున ఉయ్యాలో
సద్దుల బతుకమ్మగా ఉయ్యాలో
సాగనంపేరు ఉయ్యాలో
సల్లంగ చూడమని ఉయ్యాలో
సత్తు వాయనంతోడ ఉయ్యాలో
No comments:
Post a Comment