సామాజిక చైతన్యం
తేది : 18-10-2022
శీర్షిక : సద్వినియోగం
కవిత సంఖ్య : 170+5
జీవరాశిలో మానవాళి మిన్నంటే
అందరేమో అనుకున్నా .. కానీ
కొందరనేది మాత్రమే వాస్తవం..
ఎందెందు వెదికినా ఇదే ....
విశ్వమంతా వీక్షించినా
వినదగునెవ్వరు చెప్పినా
ఆధిపత్యం కొందరి చేతుల్లోనే ....
దేశమైనా ... విశ్వమైనా ...
వందశాతం విద్యావంతులై
నిర్భయంగా ప్రశ్నించగలిగి
నిర్హేతుకంగా సమన్యాయం
పొందగలితే ... అంతకన్నానా ...
బ్రతుకు గమనాలకై
కులమతాలున్నా...
బ్రతకనీయని సూత్రమై
రాజకీయమేలుతున్నది ....
జాతి సంపదలను కోతి
మూకలై కొల్లగొడుతుంటే
సత్తువ లేని సామాన్యులు
నిర్లక్ష్యం అయినప్పుడు ...
ప్రశ్నించడమే పరిష్కారం ....
వండి వార్చుకున్న విజ్ఞానాలను
చండీ వరములుగా భావించి
ప్రచండ సమయస్ఫూర్తిని
ప్రదర్శించి.. సద్వినియోగం
చేసుకోగలిగితేనే ... చైతన్యం
వెల్లి విరుస్తుంది ....
No comments:
Post a Comment