అంతా మన మంచికే
తేది : 30-09-2021
శీర్షిక : అనుభవాలు
కవిత సంఖ్య: 999
లోకో భిన్న రుచిలా ...
మాటల్లో మంచితనం తొణకిసలాడు
చేతల్లో చెరుపుల కోరికలు ...
నలుగురి మధ్యన మెచ్చుకోలు
నంగనాచిగ అపజయాలు కోరు ....
మాటలు కోటలను దాటిస్తూనే
చేయి విదిలించని తత్వాలు ...
తాను ప్రయత్నమేమి చేయక
ఎవరైనా ఎదిగితే ఓర్వలేని తనం ...
పెద్దమనుషులలా వేషాలు
పెదవి విరిచే తత్వాలు
మాటలతో పొగుడుతూనే
ద్వందార్థాలతో దగా చేస్తారు ....
పల్లేరుగాయల పచ్చి బీడులో
పాదాలు కదిలించి... అడుగులు
వేస్తేనే .. అనుభవాలు గడించేది ...
ఆపదలను ఎదుర్కునే ధైర్య
సాహసాలు నింపుకునేది ....
అన్నీ అనుభవిస్తూ అనుభవం
లోకి వస్తేనే...పాఠాలను నేర్పించే
గురువులై ...మనకు నిత్య విద్యార్థులమై
నేర్చుకునే తపన ఉంటే తిరుగులేదు ...
అంతా మన మంచికే ....
No comments:
Post a Comment