విధ్వంస కర్బనం
తేదీ : 17-10-22
శీర్షిక : ఎవరిది విధ్వంసం
కవిత సంఖ్య : సహస్రాధికం
మంచి చెడుల మిశ్రమం
మోతాదు మించితే వినాశనం
వివేకమై గ్రహిస్తే మోదం
హీనమైతే శిక్షించే రౌద్రం ....
అడగక ముందే అన్నీ
ఇచ్చే ప్రకృతి పంచభూతాలు ..
అయినా ఆశను అత్యాశగా
మార్చుకున్న మానవాళి ...
ప్రాణవాయువులతో పదిలమై
పదికాలాలు నిలుస్తున్నామంటే
పచ్చని చెట్లు వదిలే వెచ్చని
శ్వాసలే ప్రాణం జీవరాశికి .....
పేరుకు మాత్రం జీవరాశిలో
మానవాళినే మిన్నంటారు...
నిజానికి మూర్ఖంగా మారిపోయి
పెద్దరికం వెలగబెడుతున్నాడంతే...
ప్రళయకాలంలో కకావికలమై
పదిలంగా భూమి పొరల్లో
నిక్షిప్తమైనా నన్ను వెతికి వేసారి
కనిపెట్టి... పెకిలిస్తున్నారు ...
వంటచెరుకై ఇంటిని నిలబెట్టాల్సిన
నన్ను ... పంటికింది రాయిలా
నిలువునా తగిలేస్తున్నారు ...
ప్రతి పరిశ్రమలో ముందు వెనకల
ఆలోచించక .... ఎవరు దోషి...
ఎవరిది విధ్వంసం ...
No comments:
Post a Comment