Monday, March 6, 2023

ఆశల వనమాలి తేది : 29-09-2022 శీర్షిక : పై చదువులు

 ఆశల వనమాలి

తేది : 29-09-2022
శీర్షిక  : పై చదువులు 
కవిత సంఖ్య : 998

తెలిసీ తెలియని తనములో 
తెగువగా అడుగులు వేసిన వైనం 
జనారణ్యంలోకి  అయితే వచ్చి పడ్డాను ... 
గమనము ఎలాగో తెలియదు....కానీ... 
 
మున్ముందటి జీవితం ముదముగా 
కష్టమెరుగని కమనీయం కావాలని 
నిచ్చెనలాంటి జీవితంలో మరోమెట్టెక్కి 
గమ్యం చేరాలనే ఆశ ... ఆరాటంతో..... 

పల్లె పట్టున కష్టం విలువ తెలియకుండా 
పట్టు తేనె జుర్రుకున్నట్టు సాగిన జీవితం  
అమ్మా నాన్నల ఆలనా పాలనలో 
అలవోకగా పెరిగిన అలవాటాయె.... 

చిన్ననాటి ఆటపాటల బంగారు క్షణాలను ... 
బాల్య స్నేహితులను వదలలేక...  
బరువుగా వదిలిపెట్టి... తీపి జ్ఞాపకాల 
చిట్టాలన్నీ సంచులలో  మూటగట్టేసి ....  

కోరికొక్కటే కొండమీద దేవుడిలా కనపడుతుంటే  ...
అమ్మానాన్నకిచ్చిన మాట...పై చదువులు  
జాగ్రత్తల మాటలు పదే పదే చెవిలో 
గింగిరాలుగా తిరుగుతుంటే... 
ఆశల వనమాలినై  అడుగులు వేసా ... 

కాలినడకలే కానరాని మైళ్ళ దూరాలను 
కొలవడానికి...పట్టణ పొలిమేరల నుండి 
కావాల్సిన సామాగ్రి కొనుగోళ్ళకైనా ... 
కళాశాలకు చేరుకోని చదువుకోవాలన్నా .... 

వీడీ వీడని బాల్యచేష్టల వింత ఛాయలో 
కళాశాల పరిసరాల కలి ప్రభావమో ... 
అప్పుడప్పుడూ ఆకతాయిగా అడుగులేసినా ... 
అంతలోనే తమాయించుకుని గమ్యాన్ని 
గుర్తు చేసుకుంటూ...గమనం తీరం 
చేరేలా ... ఆశలపల్లకి 
డొల్లకుండా  సరిదిద్దుకునేది.   

No comments:

Post a Comment