దీపావళి
శీర్షిక : నిత్య దీపావళి
తేది 21-10-2022
కష్టాల నిశి చీకట్లను తరిమేసి
కలిమి వెలుగు పూలను పూయించి
చీకటి పూరిళ్లలో తురిమి ఆశల దీపాలను
వెలిగించిన ద్వాపారపు ఆనందావళి ...
ఒక్కరిద్దరు అసురుల సంహరిస్తేనే
యుగాల తరబడి వెలుగుతున్న పండగ
కలి మాయలో ఎగిసిపడుతున్న కల్మష
కాసారాల కాలకేయ రాక్షత్వాన్ని మట్టుబెడితే ....
కాదా ఇక మనసొంతం నిత్య దీపావళి.....
No comments:
Post a Comment