పొగచూరిన నేల
తేది : 14-10-2022
శీర్షిక : అత్యాశలు
కవిత సంఖ్య : సహస్రాధికం
హాలికుని చమట చుక్కల్లో తడిసిన
అంకురం స్వచ్చంగా పురివిప్పుకుంటేనే...
అవనిమాత కుంకుమపువ్వై అన్నపూర్ ణగా
ఆవిష్కరించుకుంటేనే...నీవైనా... నేనైనా..
నిజమనేది ...జీవరాశి ఉనికికి బలమనేది....
విత్తనాలను అభిషేకిస్తూ...దుక్ కి నుండి
మొదలయ్యి పంటపంటకు అడుగడున
తలంటుపోసుకుంటున్నాయి... ఈనాడు
రసాయనాలు మనకు మసాలాలుగా ..
అణుకువలను ఆవలకు విసిరేసి
వినయాలను గాలికి వదిలేసి విసర్జించి
ఆశలను అత్యాశలుగా పోగేసుకుని
అలసత్వాలను నిర్లజ్జగా అంటకాగుతూ
అయినది...కానిది...కావాలనే స్వా ర్థాలు ...
కంటపడ్డ ప్రతీది కావాలనీ కోరుకుంటూ
ఇంటపడ్డ వ్యర్థాలను అవనంతా నింపేస్తూ...
ఇగురవంతుడననుకుని కితాబిచ్చుకుని
సంబరాల సందడిలో మునిగాడు..మనిషి
స్వార్థాలకు సంకేతాలుగా పాలిథీన్లు
అలసత్వాలకు ఆనవాళ్లుగా కాలుష్ యాలు
ఆవురావురంటున్న అనకొండలుగా
పట్టణాల కంచెలై కచేరీలు చేస్తుంటే...
క్రమశిక్షణలను కాలతన్నిన పాపానికి
ఉమాపతి సహజ జలాలను తాగలేక
జనావళి అంతా కొట్టుమిట్టాడుతున్నా ...
మన్నుతిన్న పాములా ప్రజలు ప్రభుత్వాలు ....
చర్యకు ప్రతిచర్యల సహజంలా
మానవాళి అలసత్వాలకు
మాతా ప్రకృతమ్మ పరివేదనలు
పరితపనలు జీవరాశికి ....
కలపండి ఇకనైనా తలోచెయ్యి
కదిలిద్దాం కొంతమందినైనా
ఒళ్ళు విదిల్చి కళ్ళు తెరవండని...
పొగచూరుతున్న నేలను కాపాడదామని ...
No comments:
Post a Comment