గజల్
తేది :07-10-2022
కవిత సంఖ్య : సహస్రాధికం
5/5/5/5
అపురూప శిల్పకళ అద్భుతం రామప్ప
శిల్పినామంపైన విఖ్యాతం రామప్ప
అర్ధనిమీళితముల
ఆసాలభంజికలూ
అందముల రాశిగా ఆసాంతం రామప్ప
కర్రలా తొలిచిరీ కనువిందు చేసిరీ
మర్రిలా నిలిచేను యుగాంతం రామప్ప
సౌహార్ద సొబగుల సంపన్న పునాదులు
సౌండుబాక్స్ సాంకేతికతం రామప్ప
సూదిమొన దూరేటి సుందరం సందులూ
మెరిసేటిశిల ఆధ్యాత్మికతం రామప్ప
విశిష్టత రాజసం రంజిల్లే రమణీయం
విశ్వ వారసత్వ విరాజితం రామప్ప
No comments:
Post a Comment