Monday, March 6, 2023

సద్దుల బతుకమ్మ తేది: 03-10-22 శీర్షిక : ముగ్గురమ్మల మూలపుటమ్ము

 సద్దుల బతుకమ్మ

తేది: 03-10-22
శీర్షిక : ముగ్గురమ్మల మూలపుటమ్ము 
కవిత సంఖ్య : సహస్రాధికం 

ప్రకృతితో పవిత్రమే అనుబంధం 
ప్రతీది ప్రశస్తమే పండగైన హైందవం 
అడుగడుగున ఆత్మీయమే సంప్రదాయం 
అమ్మ రూపమై కొలుచు ఆసేతు హిమాచలం  

అమ్మలగన్న యమ్మ చాలా పెద్దమ్మ 
ముగురమ్మల మూలపుటమ్ముగా వెలసి  
దుర్గతులను దునుమాడిన దుర్గగా 
అవతరించె దుష్టులను శిక్షించగా .....

రంగురంగుల పూలతో రమ్యమైన 
తీరుగా శంఖాకారములో పేర్చి 
అందునా గౌరమ్మనలంకరించి 
కొలువడమే సద్దుల బతుకమ్మ ..... 

శతాబ్దాలుగా వలసవాదులంతా 
శని దేవతలై పీడించగా...శుష్కించిన 
జనం... సుందరాన సంస్కృతిని  
తలకెత్తుకుని సూటిగా ప్రశ్నించిన తత్వం .... 

నిరక్షరాస్యతల నీడలనైనా .... 
సమిష్టిగా ఎదిరించిన సలక్షణం
మౌఖికమై నిలిచి...మాయ జేసి 
మహిమాన్వితం గావించిన అమ్మ శక్తి ..... 

No comments:

Post a Comment