ఏమని చెప్పను
తేది : 18-10-2022
శీర్షిక : ప్రజాస్వామ్యం
కరటక దమనకులోలె
నలుగురిని మభ్యపెట్టడం
నారదమునివోలె నాలుగు
ముచ్చట్లు చెప్పడం చాలు ...
అక్షరజ్ఞానాలంటకపోయినా
లక్షలార్జించగల సత్తా ఆ దారిది
రావణకాష్టంలా తగులబెట్టే
రంకు బొంకుల తంపులు చాలు ..
ధవళవస్త్రాలు ధరించి
అవలీలగా అంగుళీయములతో
అవారగాళ్లను నలుగురిని
పోగేసుకునే పోత ముచ్చట చాలు ...
ఉద్యోగమందామా అంటే
అక్షరజ్ఞానాలక్కర లేదు
సేవలందామా అంటే
లక్షలు కోట్లల్లో జీతాలు పెన్షన్లు ...
నలుబదేండ్లు సేవచేసినా
దక్కని ధమాకా ఆస్తులు అంతస్తులు
ప్రజాస్వామ్యమంటే ఇదేనా ...
ఏమని చెప్పను ఎలా చెప్పను ...
No comments:
Post a Comment