Monday, March 6, 2023

మనసా ఓ మనసా ...

మనసా 

ఓ మనసా ... 


ఎలా ఉంటావో తెలియదు 
ఏమి చేస్తూంటావో తెలియదు 
నేను చూడలేను ... ఎవరికీ చూపలేను ... 
ఏమి చెప్పలేను ... ఇదని విప్పలేను .... 

ఏమున్నదే .. మనసా
చీకటి - వెలుగులు తప్పా-
నీ జీవితం ఏమి గొప్పా 
మొక్కవై వస్తావు - 
మానువై పెరుగుతావు  
కాయవై -రాలుతావు
మాయంమై పోతావు... 

నవ్విన -ఏడ్చినా  కన్నీళ్లయి కారుతావు
కనిపించని  మాయవై
వినిపించని  వీణ రాగమై మోగుతావు
ఆశ ల పందిరి లో అల్లుకుంటావు 
ఉయ్యాలాలా  ఊగుతావు
కనురెప్పలు  మూసి  కలల  కంటావు,-
ఎదో ఉహించు కుoటావు
ఎక్కడికో ఎగిరి పోతావు.. 
ఎదో వెతుకుతావు..వెంపర్లాడుతావు-

బంధం  అంటావు.. బాధ్యత అంటావు
మమతలు అంటావు  కౌగిలించుకొంటావు - 
కన్నీళ్లు పెట్టు కుంటావు... కరిగిపోతుంటావు 
కర్కశమై పోతావు ... ఘనీభవించుతావు ... 
 
ఇది అంత  మాయ అని - అది నీవే అని... 
అది నీడే  అని.... బావురు మనీ  ఏక్కి.. ఎక్కి  ఏడుస్తావు
నడిచే  కాలంలో సమాధి  అవుతావు
నిజాయితీ నీ బ్రతుకు ఐతే -నింగిలో నక్షత్రం అవుతావ్
ధర్మం నీవై  నడిస్తే  ఏ కాలం లోనైనా దేవుడివి అవుతావు... 

No comments:

Post a Comment