క్షణం ఆలోచించు
తేది : 07-09-22
శీర్షిక : అనుభవాల సారం
కవిత సంఖ్య : 167+2
నిన్నటి మీద నేడెప్పుడు గొప్పే
అయినా అనుభవాల సారం
రంగరించుకుంటే...ఎదురులేని
విజయాలన్నీ మన సొంతం ...
పారిశ్రామికీకతలతో సౌకర్యాల
సంబరం పెరిగిందనుకునే లోపు
ఉరుకులు పరుగులు ఉప్పెనలై
మాటా మంతీలకే ముఖం వాచే ...
సాంకేతికత సంబరాలు తీరకముందే
సన్నివేశాలన్నీ రక్తి కడుతున్నాయి...
దూరదర్శిని నిండా దుమ్ము రేపే
క్షుద్ర నీతులు ... ముద్ర బూతులు ....
ఆడవారిని అడ్డం పెట్టుకున్న శి ఖండులు
సకుటుంబంగా సంతోషాలను
పంచుకోలేని సన్నాసి సీరియళ్లు ....
తెరల చరవాణి తెచ్చే కదా
సౌలభ్యమని సంబరపడేంతలో ..
డేగల్లా వచ్చే హ్యాకర్స్ చేసే
బ్రోకర్ పనులు...కష్టార్జితాలకు
కన్నం వేసే కలియుగ తాంత్రికులు ....
అతి సర్వత్ర వర్జయేత్ ....
ప్రతి క్షణం పారాహుషార్
ఒక్క క్షణం ఓపికగా ఆలోచించు
అడుగేసే ముందరే తొందరలేకుండా ....
నగునూరి రాజన్న
కరినగరము (రిచ్మండ్)
..
No comments:
Post a Comment