పెట్టెలోని పట్టుచీర
తేది : 06-10-2022
శీర్షిక : రాజసం…
కవిత సంఖ్య : సహస్రాధికం
సుతి మెత్తని సుందరం
కట్టుకుంటే కమనీయం
గాంభీర్యతల రాజసం
పెళ్లి పేరంటాలలో డాంబికం ...
రక రకానికి ఒకటి చొప్పున
రంగు రంగుల కొకటి చొప్పున
రూప రూపాని కొకటి చొప్పున
సందర్భాని కొకటి చక చకా
దూరిపోతుంటాయి పెట్టెనిండా ....
ఎన్నున్నా ఏమున్నా మనసంతా
మురిసిపోవు ...మది గది మెరిసిపోవు
కళ్ళల్లో కాంతులీను అతివలందరికి
ప్రత్యేకమై పెళ్లి పట్టుచీరంటేనే సుమా ....
పాతదై పోతున్నా కొలదీ పడి పడి
పరామర్శిస్తూంటాయి జ్ఞాపకాల
నెమలీకలు...మదిని చేరి మురిపిస్తుంటే ...
వల్లె వేసి జల్లిస్తారు జలతారు ల కబుర్లు ...
పెళ్లి పట్టుచీర వయసుతో బాటుగా
పెరిగి పెద్దయిన కొడుకులు కూతుర్లు
కొత్తగా వచ్చిన కోడండ్లకు మనవలు మానవరాండ్రకు.. .
కొన్నదగ్గరనుండి కలిసి వచ్చిన కలిమి
సందర్భాలను...మాటలలో ఉటంకిస్తూ ఊరిస్తూ ...
మహిమల మతలబులను బోధిస్తుంటారు...
నాటి అమ్మమ్మ తాతయ్యల ముఖంలో
మెరిసిన మెరుపులు ... ఆప్యాయతల ఆరాటం
మురిపాల ముచ్చట్లన్నీ పుణికిపుచ్చుకుని పూసగుచ్చు...
పెళ్లి పట్టుచీరెతో నిండిపోయిన మనసుఁ బంధాలను
అనుబంధాలను కంటి చెమ్మతో కురిపించు....
No comments:
Post a Comment