Monday, March 6, 2023

మానసిక ఆరోగ్యం తేది : 10-10-2022 శీర్షిక : ఎరువును బట్టి తరువు

 మానసిక  ఆరోగ్యం 

తేది : 10-10-2022
శీర్షిక : ఎరువును బట్టి తరువు 
కవిత సంఖ్య : 170+3

భౌతికమైనా...మానసికమైనా 
ఆరోగ్యమే మహా భాగ్యము 
ఎరువును బట్టి తరువులా 
అన్నపానీయముల కొంత చేయగా ... 

కర్ణుడి చావుకు కారణాలనేకంలా
కపట కల్తీల కలిమాయలలో 
కాలుష్యాల కబంధ హస్తాలలో 
మనిషికి విశ్రాంతి లేదు 
మానసిక  ప్రశాంతత లేదు ..... 

నియమ నిష్టలు తప్పిన 
పారిశ్రామికీకరణం అనుకునేంతలో 
పట్టు తప్పిన సాంకేతికతల సంధి 
సమయంలో కొట్టుమిట్టాడుతున్నాం ... 

గతి తప్పిన స్వార్థాలపై స్వారీ చేస్తూ 
గడ్డు రోజుల కాలాన్ని దాటాలని కుంటిగుర్రంపై 
గమ్యమెరుగని గమన ప్రయాణాలతో
గతుకుల రోడ్లలో బతుకులీడుస్తున్నాం... 
 
పర్యావరణాన్ని పతనం చేసి పాతరేసాం ... 
జలవనరులను నిర్లజ్జగా నిర్జీవం చేసాం ... 
శబ్ద కాలుష్యాలను చంకనేసుకుని 
లబ్ద ప్రతిష్టల కొరకు పాటుపడుతున్నాం .... 

నేలవిడిచి సాము చేసిన చందంగా 
బాధ్యతలు వదిలి హక్కులకొరకు కొట్లాడుతూ  
రాజుగారి పాలబిందెలో నీళ్ల విధంగా .... 
శాంతిలేని ప్రశాంతతలను వెదుకుతున్నాం ... 

మనవంతు ప్రయత్నంగా పాదం ముందు 
కలపాల్సిందే కలుపు మొక్కను కూకటి 
వేల్లోకి పెకిలించ…యోగ ధ్యానాల కోసమై ... 
శారీరక ధృఢత్వమే ... కాముక మానసిక 
ఆరోగ్యానికి దోహదం చేస్తుందనడంలో 
ఎలాంటి సందేహం లేదు .... 

No comments:

Post a Comment