కోడి రాంమూర్తి నాయుడు గారి వర్దOతి
తేది: 16-01-2022
ప్రత్యేక కవిత .....
కవిత సంఖ్య : 85+6
పేరులోనే పెన్నిదైన కోడి
జీవితంలో మాత్రం బహు దూరం
అచ్చమైన శాఖాహారిగా
అప్రతిహతమైన ఖ్యాతి పొందే ....
కళింగములోన కన్ను తెరిచి
ఖండాంతరాల పేరు గాంచె
ఒక్కడుగా బయలుదేరి
పదహారువందల మందికి
ఉపాది కలిగించే తాను ....
ప్రవృత్తిగా ఎంచుకుని
మల్లయోధుడిగా అవతరించె ...
సర్కస్ కంపెనీ నెలకొల్పి
పేరు పొందె విశ్వమందు ....
లెక్కలేనన్ని సత్కారాలు
లెక్కకు మించిన బిరుదాంకితులు
ఆత్మీయ మిత్రునిచేత అలంకరింపబడె
"సాధు పథవర్తి సన్మిత్ర చక్రవర్తి
రమ్యతరకీర్తి శ్రీ కోడి రామమూర్తి "
యటంచు ......
సాంప్రదాయ విద్యలన్నీ
సంయమన పరిచి ...
బలప్రదర్శన మల్ల విద్యలో
బహుచక్కగా జొప్పించె ...
ప్రాంతీయంగా ... జాతీయంగా
వన్నెలీని ... విశ్వాంతరాలలో
జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసిన
తెలుగు తల్లి బిడ్డడు .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment