Saturday, June 4, 2022

కాలం ముంగిట తేది: 20-12-2021 శీర్షిక: మనమంతా సాక్షులం ….

 కాలం ముంగిట 

తేది: 20-12-2021
శీర్షిక: మనమంతా సాక్షులం …. 
కవిత సంఖ్య: 810

స్వార్థ చింతనల సమస్యల్లేవు 
బంధు ప్రీతి బాగోతాలెరుగదు 
పరతమ భేదమెరుగని సమన్యాయి... 
నీతి ధర్మం నిక్కచ్చిగా పాటించే  నిగర్వి... 

ఓడలు బండ్లయి.. 
బండ్లు ఓడలయ్యే 
బ్రహ్మాండ చిత్రాలు .... 
రాజులు సిపాయిలయి... 
సిపాయిలు రాజులయ్యే 
రసరమ్య కావ్యాలు ... 
కాలానికెప్పుడూ దాసోహమే.... 

కాలమార్పుల కనుసన్నల్లోనే 
మనమంతా పుట్టి పెరిగి పెద్దయి 
పయనించినా ... 
కనిపెట్టలేము సూక్ష్మంగా …. 
అనుభవించడం మినహా మోక్షంగా…. 

కాలాన్ననుసరించి కర్తవ్యం నిర్వహిచడమే 
కలబడి నిలబడలేని కబోదులం 
కాలాన్నెప్పుడు జయించలేము 
కాలం ముంగిట మనమంతా 
కదిలిపోయే ప్రవాహ సాక్షులమే ..... 

కాలగతిలో కదిలిపోయిన చరిత్రలెన్నో …
పదవీ అధికార మదాలయినా …
అర్థాంగ బలములైనా వ్యర్థ ప్రేలాపనలే ….
కాలంతోపాటు కాలు కలిపి నడవాల్సిందే…. 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment