యువతరం
తేదీ : 12-02-2022
శీర్షిక : వజ్ర సంకల్పుడు .....
కవిత సంఖ్య : 820
శాస్త్రవేత్తలకన్నా ముందే
భూమి గుండ్రమన్న వరాహావతారం...
అస్త్రం శస్త్రం శాస్త్రం .... ఏదైనా
అందుబాటే మన వేద సంపదలో ......
సగటు మనిషికి చేర్చడమే
సంధాన ప్రక్రియ ....
ఎవరైనా ఎదురులేదు ....
ఎంపిక చేసినవారనే
నియమము లేదు ......
పుట్టుక చావులు నీవి
బతుకంతా ప్రజలదే
అన్నాడో మహా కవి
అలాంటివారే మన నరేంద్రుడు .....
అక్షరాలా అతుకుతుంది
ఆనాటి మన నరేంద్రునికి ...
అకుంఠిత దీక్ష ... అపార
విజ్ఞానం ... విశ్వానికే కానుక .....
ఆధ్యాత్మికంలో ఆరితేరి ...
శాస్త్రాలలో శక్తి యుక్తులు చాటి ...
పాశ్చాత్య తత్వాలను పదిల
పరుచుకున్న ప్రజ్ఞా శాలి ......
మతమనేది మనకు మనము
ఆధ్యాత్మికంలో మలుచుకోవడానికే...
పడుతున్నందుకు కాదు ...
లేస్తున్నందుకు కెరటం నాకు
ఆదర్శమన్న ధీశాలి .....
అంతః శక్తిని…ఆత్మశక్తిని
మేల్కొల్పిన ఆయుధం...
అయన అపారమైన రచనలు
యువతకు స్ఫూర్తి ..జాతికి కీర్తి ....
సత్తా లేనోళ్లే సాటింపులు
చేసుకుంటున్న రోజులు ....
వజ్రసంకల్పుని వాక్కులను
వల్లించుకొని ... ఆచరించడమే
మనకు మార్గదర్శకము.....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment