నీలి విప్లవం
తేది: 27-12-2021
శీర్షిక: జల పుష్ప ఎవుసం
కవిత సంఖ్య: 811
తాగు నీటి ఊటల జాడలే
తరగని నాగరికతల నిలువ నీడలు ..
మహీతల మరకతాలతో పాటు
జల జీవన ప్రాణులు..జీవరాశి పోషకాలకు…
జవ సత్వాలకు జావళీలాయె…
జనాభా క్రమానుగత పెరుగుదలలో
సముద్ర సంపదల తరుగుదలలో
ఎనకపడిన మత్స్య సంపదలకు
ఎదురుపడి దన్నుగా నిల్చున్నది….
ఎనభైలలో వెలుగులోకిచ్చినా
ఎలుకవాహన పయనమైనది…
మంచినీటి సరస్సుల మైలురాయితో
మడుచుకున్నదొక పుటను తన
మతలబుల డైరీ పేజీలలో …
అనువంశికంగా ఆహారాలే కాదు
పర్యావరణ సమతూలికాలు కూడా
ఆహార వ్వవస్థకు ఆర్థిక వ్యవస్థకు..
ఆక్వా ఎవుసంగా..అల్లుకున్న
సుందరమైన బంధం….
అనేక పోషక విలువలతో పాటుగా
ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ వంటి
ఒంటరి అపూర్వ ప్రత్యేకతలను
ఒనగూర్చుకుని సంతరించుకున్న
ఏకైక ఆహార పోషక మాణిక్యాలు….
ఉప్పుతో మొదలైన అనుబంధం
ఉప్పునీటి చేపల చెరువులు… మంచి
నీటి చేపల చెరువులే కాకుండా…
మడ అడవుల అడుగులతో… మట్టి
సుగంధం ఉట్టిలో పెట్టిన పెరుగు కుండై
నిత్యం అండదండలే… మన హాలికుడికి ….
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment