చిత్ర కవిత
తేది: 19-12-2021
శీర్షిక: అలుసు
కవిత సంఖ్య : 194
అమ్మంటే అపరబ్రహ్మాంటూ
అత్యధికులు ఇచ్చే కితాబులే
అనువంశపు పురోభివృద్ధిలో
అందిపుచ్చుకునుడే అర్ధభాగం...
ఎకరాల పెట్టు ఎవుసమైనా
భోధనలైనా సాధనలైనా
ఉత్పత్తుల కర్మాగారములైనా
సేవలందించే కార్యాలయాలైనా ...
అవనినుండి అంతరిక్షంవరకు
వెనకడుగువేయని తనమే
ప్రతి మగవాడి విజయానికి
వెన్నుదన్నే అడుగడుగునా….
కన్నవారినైనా కట్టుకున్న వారినైనా
కనిపెంచిన పిల్లలనైనా
కష్టసుఖాలలో కలిమిలేముల్లో
కళ్ళల్లో పెట్టుకుని కనిపెట్టుకునే కార్యశీలి...
తల్లిగా తాను కట్టేసుకుని
పదిమంది కడుపులు నింపినా ...
కనీసం తిన్నావా... ఉన్నావా..
పలకరింపులకే పొంగిపోయే తాను...
అయినా…
ఆడవారంటేనే అలుసు
పుట్టుక తోడనే పుల్ల విరుపులు
పెంపకంలో కూడా అంపకాలే
నడకలోన బోలెడు జాగ్రత్తలు
తప్పులేకున్నా తగవులేసుకోను…
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment