తూకం రాళ్లు
తేది: 20-01-2022
శీర్షిక : మణిమాణిక్యాలు
కవిత సంఖ్య : 827
సంపాదన రాశులెన్నున్నా
సన్మార్గమే మిన్నన్నది
సర్వత్రా నినాదమై సాగాలి
సాహో నాగరికత చిహ్నంగా
నిలవాలి ....
నూటికో కోటికో ... ఒక్కరు...
యుగాలు మారినా జగాన వారే
అవుతారు ఆ శ్రీరామచంద్రులు
అమ్మ నాన్నల మాట జవదాటని
వీరులు శూరులు ....
చండాలం నెత్తికెత్తుకున్నా
చంటి బిడ్డ ఆలులనమ్ముకున్నా
చలించని నీతి నియమాలే
శంక తీర్చి ...
రూపు దిద్దింది
మాటకు కట్టుబడ్డ మహనీయుడని
హరిశ్చంద్రున్ని ....
సర్వ విధాలా సత్తా ఉండి కూడా
సంయమనం పాటించిన అచ్యుతుడే
ఆదర్శం కాలేదా అందరికి
ధర్మ సంస్థాపనలో దండించ .....
అభయమిచ్చానంటూ
అందించె కద... ఆపన్న హస్తం...
ఆ కపోతమునకు
శిబి చక్రవర్తి
కోరి తొడ నుండి మాంసం కోసి తీసి సమముగా ....
మాతృ దేశమన్న మనసుపడి
మరువరానిదంటూ ... ప్రాణాలను
సైతం ఫణముగా పెట్టి .... చాటలేదా
మహాత్ములు..... చాల మంది....
మణిమాణిక్యాలుగా ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment