సొగసుతో కులికేను చీర
తేది: 20-01-2022
శీర్షిక : సప్తవర్ణాల సొగసులు
కవిత సంఖ్య : 203
నాగరికతలో నడకలు నేర్చిన మనిషి
కూడు గుడ్డ గూడు అత్యవసరాలుగా
అల్లుకుని ...పారిశ్రామికీకరణకు బీజమేసి
ప్రపంచాన్నే శాసించినా ... వన్నెలన్నీ
వస్త్రాలతోనే .....
కట్టూ బొట్టులతోనే కదిలించింది విశ్వాన్ని
కమనీయమైన చీరె కట్టే హిమశిఖరమై ....
అమ్మతనానికి ఆత్మీయ నిర్వచనమై
ఆలి తనానికి అనురాగ బంధమై ...భారతాన
సప్తవర్ణాలు సంతరించుకుని
రమణీయతలు పెంచుకుని
అందమైన చీరలుగా అలరించి
సొగసులీను హైందవాన చీర ....
గ్రీష్మ తాపాలకు చల్లదనాలనద్దే
చందనాలు నూలు చీరెలు ....
పడుచుల అందచందాలను
కుందనాల బొమ్మలుగా తీర్చిదిద్దే
సిలుకు చీరెలు ......
చిన్నా పెద్దలకు చిత్రంగా
అమిరిపోయే పట్టు చీరెలు
ఆడవారి సొగసులకు అదనపు
అందాలను అద్దుతూ ...
అగ్గిపెట్టెలో సైతం ఇమిడిపోతుంది ......
దూదిలోని దారాన్ని గుర్తించి
అడ్డాలు నిలువులుగా పేర్చి.... వస్త్రాలు
ప్రపంచానికి పరిచయం చేసిన
నేతన్న మాత్రం ... గంజిమెతుకులు
కరువయ్యి ...గింజుకుంటున్నాడు ....
అక్కడక్కడా ....
మానవత ప్రదర్శించి మనమంతా
చేయి కలిపితే .... కాదేది అసంభవం
కడుపులు నింప ... మన నేతన్నకు .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment