చిత్ర కవిత
29-01-2022
శీర్షిక : వాస్తవం
కవిత సంఖ్య : 85+10
చక్కనమ్మలు చదువులమ్మ ఒడిలో
సేదదీరాల్సిన వయస్సులో ....
పచ్చలు పొదిగిన పర్ణశాల ముందు
పడతుల మోమున పరాకులేలనో ....
సిగ్గుల మొగ్గలతో చెక్కిలి
కెంపులై చక్కగా మెరియంగ
ఇద్దరమున్నామని సుద్దులు
మరచిన సుదతుల మదిలో
మెదిలే ఆలోచనలేమవునో .....
ఆర్థనిమీలితమైన కళ్ళతో
పరధ్యాన్నమైన మనస్సుతో
రెప్పలు వాల్చని ఊహలు
గుండె గదిలో గుప్పుమన్న పరిమళాల
దాఖలాలేమో ....
తెరవాణి చేత లేకున్నను
మరబొమ్మలైన వైనమేమిటో ...
మూగనోమున ... మోముపై
మాయమైన చిరునవ్వుల
మతలబులేమిటో ......
చిలిపి కోరికల చిట్టాలన్నీ ...
ఊపిరి సలపని ఉప్పెనలా
భారమైన పరువపు భావాలతో
మానసమంతా నిండెనా .....
బాధ్యతల బ్రతుకు చిత్రం మాత్రం
వాస్తవ జగత్తుకు దారి చూపుతున్నది ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment