వినోదపు బొమ్మలు
తేది: 25-01-2022
శీర్షిక : మానసికోల్లాసాల మంత్రం ....
కవిత సంఖ్య : 830
ఆకలి దప్పుల అలమటింపులే కాదు
మానసికోల్లాసాల మంత్ర తంత్రాలు
మనుషులకు మాత్రమే సొంతం ....
అలసటలలో నుండి కూడా ఆరితేర...
ఆ ఆలోచనల బీజమే... తోలు బొమ్మలాట
జీవరాశిలో మనిషిని విభిన్నం చేసిన
అనేక విశిష్టతలలో నిల్చిన అవతరణ ...
పిల్ల పెద్దలను ఉర్రూతలూగించిన వినోదం ....
వేరువేరు ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో
వెలుగొందినప్పటికీ ...విశ్వమంతా
విస్తరింప జేసింది మాత్రం భారతీయులే ...
తోలుబొమ్మలైనా .... కట్ పుతిలీలైనా .....
అంచెలంచెలై అభివృద్ధి చెందినా
అపూర్వమైన కృషి పట్టుదలలతో పాటు
పుణ్యభూమి మీద... పురాణాలమీద పట్టు ...
పునీతం చేసింది మానవ మేధస్సును ....
పరివర్తనల ఫలాలే నాటకాలైనా .....
మూకీల నుండి టాకీలుగా అడుగులేసి
నలుపు తెలుపులై ... సప్తవర్ణాలతో
తళుకులీనుతున్న నేటి వెండి తెరల
సినిమా రంగం....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment