రెక్కలు తొడిగిన ఉత్సాహం
తేది: 28-12-2021
శీర్షిక: మల్లెల పరిమళాలు…
కవిత సంఖ్య: 812
ప్రకృతితో ...దళారులతో… ప్రభుత్వాలతో..పతారలతో ..
సమస్యల కొలిమిలో సతతం సతమతమౌతూ
అడుగడుగున నిలిచి పోరుతున్న హాలికునికి ...
నేనున్నానని తెలిపే పలుకుల భరోసాలే బారసాల ...
అపరిపక్వతలో ... అలసత్వాలో ...
బుంగమూతుల రంగులలోకపు
బాల్యంలో.. ఫలితంపొందని పరీక్షలకు..
ఆత్మీయతలు వెదజల్లే అమ్మానాన్నల పలుకులే...
ఆశలు నింపే ఉపశమనాల ఊతం...
అంకురాల ఆశల హరివిల్లుల గగనంలో
బొంకు నేర్వని యువ వ్యాపారవేత్తలకు
జంకు లేని రాచమార్గమే…
బింకమగు ప్రత్యక్ష పరోక్ష పథకాలు ...
నీతులు చెబుతూ గోతులు తవ్వే
పొరుగోడి దౌష్టానికి తోటోళ్లు బలయిన
దుఃఖ క్షణములో... దీటైన జవాబుగా
ఘాటైన ఆయుధమే సర్జికల్ స్ట్రయిక్స్ ...
శిశిరంలో పండుటాకులు రాలినా
వసంతంలో చివురాకుల మొగ్గలకై
ఆరాటంలా…మలిదశలో అడుగులేయ …
మల్లెల పరిమళాలు వెదజల్లు ఎవరికైనా
రెక్కలు తొడిగిన ఉత్సాహమే…
ఉక్కు సంకెళ్లనయినా తత్తునియలు
చేసుకుని.. మొక్కవోని దీక్షలతో ముందడుగేయ...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment