దేవదాసి
తేది: 23-01-2022
శీర్షిక : విజ్ఞుల మౌనం ....
కవిత సంఖ్య : 205
ఆదిమ మానవుడు మాధవుడై
సంస్కరించబడినాడంటే
ఆధ్యాత్మికతలు నిండిన
ఆచార సంప్రదాయాలన్నో ....
ఎన్నెన్నో ..... హైందవాన ....
అయినా అక్కడక్కడా
స్వార్థం సవారీ చేసి .....
బలవంతుల చేతీలో
బందీ అయిన దాఖలాలు ....
పేర్లు వేరు వేరయినా
మతాలు వేరు వేరయినా
పెత్తందారీల ఆగడాలే ...
విశ్వమంతా రకరకాలుగా ....
భగవంతుని పేరుమీద
జోగినీ ... దేవదాసీ ...లంటూ
దేశమంతా దురాచారమే
నిరక్షరాస్యతల నిలువెత్తు సాక్ష్యం .....
చట్టాలెన్ని చేసినా ...
సట్టు ఉన్నోని సుట్టాలైతే
ప్రజలంతా.... బలమున్నోడి
బాంచెల బతుకులే .....
విజ్ఞుల మౌనం వహిస్తే ....
విపరీత నాశనమే జాతికి ....
ప్రశ్నించే గొంతులు లేకపోతే
పక్షి గోసలు తప్పవు ప్రజలకు ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment