సంక్రాంతి
తేది: 05-01-2022
శీర్షిక : మకర సంక్రమణం ....
కవిత సంఖ్య : 197
హేమంతములో "ఛూ " మంత్రంలా
దుప్పట్లకింద దూరిపోయేంత
గజగజల చలి వణుకులు
గంభీరమైన లార్వా జీవితాలు .....
సౌరమాన కాల ప్రామాణికతల్లో
పుష్కర సంక్రమణలలోకెల్ల
పునీతమే... మకరసంక్రమణం ...
హైందవమ్మున అతిముఖ్యమై .....
మూడు రోజులు
పెద్దపండగై
ముద్దుగొలుపు మురిపముగా ...
భోగి... సంక్రాంతి.... కనుమలుగా ...
విశ్వమంతా నిండిన
తెలుగులోగిళ్లలో...
అల్లంత దూరాన ఆకాశవీధిలో
అలరించే ఇంద్రధనసులన్నీ
అవని చేరి ... అతివల చేతులలో
ఒదిగిపోయి ... ఒయ్యారాలొలుకు
రంగు రంగుల రంగవల్లులై ....మాసమంతా ...
ఆరుగాలం అవనిని అంటిపెట్టుకున్న
హాలికుని మోములో ఆనందాలు
వెల్లివిరియు ....అన్నపూర్ణాదే వి
ఆదరించి ఇల్లు చేరగానే ..... కించిత్
గర్వంతో ఛాతీ సైతం ఉప్పొంగు ....
కొత్త అల్లుండ్ల కోర్కెలు మురిపంగ దీర్చ .....
చిత్రవిచిత్రమైన ఆకృతులతో
చిన్నా పెద్దలనలరించంగా .....
వాలు గాలికి వన్నెలద్దుచూ పోటీపడు
రంగుల హంగులతో గాలిపటాలు ....
మురిసిపోవు పల్లె ఎదలన్నీ
సిరిమల్లె పరిమళాలతో ....
ఆధ్యాత్మికతలను స్పర్శిస్తూ
అనుసంధానించే సంకీర్తనల
హరిదాసుల పాటలతో ....
బసవన్నల సయ్యాటలతో ......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment