ఆరోవేలు
తేది :18-01-2022
శీర్షిక : ఓటర్లంతా
కవిత సంఖ్య : 825
మనిషి ఇంద్రుడు చంద్రుడు
మహోన్నతుడని వల్లింపులే ...
జీవరాశిలో అందరికన్నా మిన్నని ...
విజ్ఞాన వివేకాల గని అని.... ప్రశంసలు
మనకు మనమే కితాబులు ....వ్యర్థమే...
స్వార్థాన్ని జయించనంతవరకు .....
పక్కవాణ్ణి ఎక్కి తొక్కిన పిక్కటింపులతో
వలసవాదుల విముక్తి కోరి కదా ....
సాయుధ పోరాటాలు....సంధించాం
అహింసా మార్గాలతో సాధించుకున్నాం
స్వాతంత్య్రం ...
దేశ దేశాల పాలనల అవపోశనలతో
రాజ్యాంగాలెన్నో రంగరించి జల్లెడ పట్టి
రాసుకున్నాం లెక్కలేనన్ని విభాగాలుగా ....
చదువుకుంటున్నాం నిత్యం వల్లెవేస్తూ ....
మన రాజ్యాంగం ....
ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పని
ప్రజలచేత ప్రజల కొరకు ప్రజలే
పాలకులని ...పాలకులంటే సేవకులని
అందరూ సమానమేనని .....
ఓటు వేసేంత వరకే ఒడమల్లప్ప
ఓట్లయిపోయాయా ...అంతే సంగతి ..
అధికారదర్పాల ముందు ....అద్దాల మేడలే ....
పాలకుల స్వార్థాల ముందు .... ప్రహరీలే
ఓటర్లంతా ఈనాడు ఆరోవేలే ....
ప్రజాస్వామ్యపు పచ్చిక బీడులో ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment