మది భాష
తేది 10-01-2022
శీర్షిక : మౌన భావం .....
కవిత సంఖ్య : 819
ఆలోచనల కడలి అంతరంగం
ఎప్పుడు చిలికినా భావబహిర్గతమే
అప్పుడప్పుడు మాత్రం అంతః కరణ
శుద్ధికో....మరెందుకో....మౌనం పూను ....
ఎదలు కలసిన మదులలో ...
మదుల భాషల ప్రవాహం ....
కను ముక్కుల తీరుతోనే ...
దరహాసపు దండి కవళికలే ...
ఉలికిపాటుకు ఊపందుకును ....
వర్ణమాలల వరుసలెరుగదు
గుణింతాల గుసగుసలు లేవు
భాషాభాగాల బాగోతం లేదు ...
అలంకారాల గోల కానరాదు ...
మదిభాషల మౌన ముగ్దతలను
అత్యంత ప్రియమైన బంధాలలో
ఆపదసంపదలలో అందుకునే
సుమధుర సుందర దృశ్యాలు .....
గురు శిష్యుల బంధమో ....
ఆత్మను ఆత్మ పలకరిస్తే ....
పరంధామ భక్త బృందమో
ఆత్మ ...పరమాత్మను సందర్శిస్తే .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment