కాలమిచ్చే తీర్పు
తేది: 02-02-2022
శీర్షిక : కాల స్వాధీనమే .... అంతా
కవిత సంఖ్య : 96+1
చిక్కు వీడని లెక్కలేనన్ని సమస్యలకు
దిక్కు దివాణం లేని ఎన్నో ప్రశ్నలకు
కాలమే చక్కని పరిష్కారం చూపి
చిక్కని సమాధానాలతో తీర్పునిస్తుంది ....
గీతలో గోవిందుని బోధనల్లాగా
కృషి పట్టుదల శ్రద్దలతో చేసిన
మనిషి కూడా అంతా తనవల్లే
అనుకుని విర్రవీగే నిమిషంలో .....
మనిషి భ్రమలను పటాపంచలు చేసి
కాలం తీర్పు జయాపజయాలను
తానందిస్తూ ధర్మ స్తంభంలా
స్థితప్రజ్ఞతతో నిలబడుతుంది .....
ఓడలు బండ్లుగా ...
బండ్లు ఓడలను చేస్తుంది ....
బ్రహ్మాండమైన చిత్రాలుగా
రసరమ్య కావ్యాలుగా కాలం
చిత్రీకరిస్తుంది .....
కాలాన్ననుసరించి మనమంతా
కర్తవ్యం నిర్వహించడం మినహా
కాలంతో కలబడి నిలబడలేని
కబోదులం ... కదిలిపోయే కాలానికి
మనమంతా ప్రవాహ సాక్షులం .....
మాటల్లో చెప్పలేకపోయినా ...
చేతల్లో తన సత్తా చూపిస్తూ ....
మర్మంగా బోధనలు వినమంటూ
కాలం ... తన స్వాధీనంలోకి లాక్కుంటుంది ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment