కలల ప్రపంచం
తేది : 30-12-2021
శీర్షిక : రంగుల లోకం ....
కవిత సంఖ్య : 196
అవును ....
మనసుండాలి గానీ
కలల ప్రపంచములో మనమూ
విహరించి రావొచ్చు .....
ఖర్చుల పద్దులు రాయక్కరలేదు
కాలం ఖర్చులు చేయక్కరలేదు
కంటి రెప్పలు వాల్చితే చాలు
కలల ప్రపంచాన్ని నిర్మించుకోవచ్చు ....
ఒక్కొక్కరిది ఒక్కోక్క పంథా ....
లోకో భిన్న రుచి లా .....
భిన్న లింగాలు .. భిన్న వయసులు ...
భిన్న మనస్సులు ... విభిన్న
కోరికలు ..... వెరసి అదో రంగుల
ప్రపంచం .....
కొంతమందికి .... బాల్యంలోనే
బ్రతుకు తోవపై కలలు .....
కృషి పట్టుదల దీక్షలతో
పెట్టుబడులు పోగేసుకుని
బీజమేసి .... అంకురమై
అరవిరియాలని ఆకాంక్ష ....
కలాంగారి ఉద్భోధనలా .....
ఇక ... యువ తరంగానికైతే
కదిలించి ముట్టుకుంటే చాలు .....
మూగ సైగలు ... మౌన భాషలు ...
నేత్రావదానాలతోనే .....
సరస భాషణలు కుమ్మరిస్తారు .....
స్వార్థ అశ్వాలపై స్వారీ
చేసేవారు సంపదల పోగులో
తలమునకలై ఉంటే .....
దేశం కోసమే దేహం
అర్పించాలనుకునే వారంతా
మరొక రకం ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment