చిత్ర కవిత
తేది: 21-01-2022
శీర్షిక : భారతమ్మ బిడ్డలు
కవిత సంఖ్య :85+9
కొండల ఉన్నా.. కోనల ఉన్నా ..
ఎన్నికలకు... లెక్కకు కావాలె..
పస్తులున్నా... పండుగయినా
పన్నులు కట్టే ప్రజలు కావాలె ...
సంవత్సరాల తరబడి
రేవులేని బతుకులకు
తావులేని అవసరాలకు
జాడలేని ప్రభుత్వాలు తోడాయే ....
సర్కస్ ను తలపిస్తున్న తమాషా
కొండ అంచులమీద కోలాటం
బిందె మీద బిందె పెట్టుకుని
కఱ్ఱమీద కాలుపెట్టి కదలడమంటే ....
ప్రమాణాలు చేసిన ప్రజాసేవకులు
ప్రతిజ్ఞలు చేసిన పదాధికారులు ....
ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ...
భరతమాత భవితవ్యం బాగుపడేదెన్నడో ....
ఉప్పూకారం తిన్నందుకన్నా
ఉక్రోషం ఉండాలి ... మనిషిగా
పుట్టినందుకన్నా మారాలి ఆలోచన ...
అందరు బాగుండాలి ... అందులో
నేనుండాలి ....అనే విధంగా పాలకులకు ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment