జానపద గేయం
29-01-22
అట్లట్ల పొయ్యేటి
చిట్టీ నా చిన్నారి ....
నెలవంక దింపుకుని
వెన్నెలద్దుకున్నావా
తెల్లతెల్ల కుసుమాలు
మల్లెలనే ముడిశావా
పరిమళాలు వెదజల్లి
సొగసులన్నీ నింపావు ....
ప్రాణమంత కదిలిపోయె
పలకరించ మనసాయె….
గొంతెత్తి పిలిచినా
గెంతుతూ పోతున్నవు ...
స్మార్ట్ ఫోన్ల మునిగి నీవు
అయినోన్ని సూడవా ....
వాట్సాప్ ల చాటింగులు
వట్టి వట్టి మాటలేనా ....
ఎదురుపడి నిల్సుంటే
బెదిరి బెదిరి సూత్తున్నవు....
ఫేస్బుక్కుల పోస్టులన్నీ
ప్రేమపాట మనుకుంటి
కలుసుకుని మాట్లాడితే
కలవరపడి పోతుంటివి .....
సెల్లులోన సొగసులతో
సెగలు కురిపిస్తుంటివే
కళ్ళముందు నిలబడితే
ఒళ్ళు దాసుకుంటుంటివి ...
తారలా ఉన్నావని
తళుకులీనుచుంటివా ....
మొరటోనిగ ఉన్నానని
మొఖము చాటేస్తవా ...
గుండెల్లో నిండారుగా
నువ్వళ్ళుకున్నావే ....
నామనసే వెన్నముద్ద
నవనీతం నీ కోసం ...
ఒట్టుబెట్టి చెబుతున్న
కనికరించి కట్టుకోవే
కళ్ళళ్ళ పెట్టుకోని
నిన్ను పూలల్లా నడిపిస్తా ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment