మెరిసేదంతా ....
తేది: 30-012-2021
శీర్షిక : నేటి ప్రజాస్వామ్యం ......
కవిత సంఖ్య : 83+2
పకడ్బందీ లిఖితపూర్వకం
ప్రజాస్వామ్య గణతంత్రం
పలుదేశాల రాజ్యాంగాలను
కాచి వడబోసిందంటూ ... ఉబ్బి
తబ్బిబ్బై పోయి జబ్బలు చరుచుకోవడమే ....
ధవళ వస్త్రాలలో ధగ దగలు
కుమ్మరించి ప్రదర్శించినా ..
దగాకోరు బుద్ధులే కొంతమంది
కొంగజపం ప్రజా ప్రతినిధులకు ...
ప్రజా సేవలకు మేమె ముందువరుస
యోధులమంటూనే ... నీ
పర్సు తెరవకుండానే .... నవ్వుతూ...
నవ్విస్తూ .... పైకం మాయం చేస్తున్నారు .....
ఓటుకు నోటంటూ మొదలుపెట్టి
విలువల వలువలు తప్పదీస్తూ
ప్రజాస్వామ్య వజ్రాయుధాన్ని
పరిహాసం చేస్తూ .... పంచెలూడ
దీసుకుంటున్నారు .....
అక్షరజ్ఞానాలు అసలు లేకున్నా
లక్షల కోట్లు పోగేసుకోడానికి
పక్కాగా ప్రణాళికలు రచించుకుంటూ
ఎవరెవరి స్థాయిలో వాళ్ళు బరిలోకి
దిగి కబాడీ ఆడేస్తున్నారు ......
ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలన్న మాట
పుస్తకాలలోనే నలిగి పోతుంది ...
ప్రజాసేవంటే .... ఆనాటి పటేలు శాస్త్రి
వాజపాయి పి వి లాంటోళ్లన్న విషయం
ఎంతమందికి తెలుసు ......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment