సంక్రాంతి
తేది : 13-01-2022
శీర్షిక : ఆనందాల పందిరి
కవిత సంఖ్య : 85+3
కాంక్రీటు భవనాల కబంధ హస్తాల
నుండి ... స్వేచ్చా గాలులకై పట్నమంతా
పరారయ్యి... పల్లె తల్లి ఒడిలోకి పావురంగా
చేరుకునే ప్రశస్తమైన పండగ ....
హేమంత తుషారాలతో శ్రీమంతమైన
ప్రకృతిలో .... పచ్చదనాలతో మెరిసే
పల్లె అందాలన్నీ కులుకులొలుకుతూ
సిరులందించే లోగిళ్ళు ......
ముత్యాల రంగవల్లులతో ... ముద్దుగొలిపే
గోవుపేడతో గొబ్బెమ్మలనలంకరించుకుని
బంగారు వర్ణాల బంతి పూవులతో ...
నిండుగా కళకళలాడే వాకిళ్లు ......
ముచ్చటగా సంప్రదాయాన్ని
ముందు తరాలకు అందించే
నగర సంకీర్తనల హరిదాసులు ...
బసవడితో ఆటాడించే గంగిరెద్దులవాళ్లు ....
సిరిసంపదలు నిండిన లోగిళ్ళు
పిల్లా పాపలతో కిటకిటల వాకిళ్లు
సుద్దులెన్నో వల్లె వేసుకునే పెద్దోళ్ళు
ఘుమ ఘుమల పిండివంటల ఇళ్ళు ....
భోగి సంక్రాంతి కనుమగా ....
మూడు రోజుల ముచ్చటైన పండగ
తెలుగువారి ఆచారాల కానుక
సంస్కృతీ
సాంప్రదాయాల ఖజానా .....
అంగరంగ వైభవంగా జరుపుకునే
ఆనందాల పందిరి ....
ఆత్మీయతలు పంచుకోవడానికై
అమ్మింటికి పయనమయ్యే సంక్రాంతి ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment