కాలాన్ని లెక్కిద్దాం
తేది: 22-12-2021
శీర్షిక : అక్షయమైనది
కవిత సంఖ్య :
ఆది తెలియదు అంతు చిక్కదు అక్షయమైనదానను.
కనుచూపుమేర కారిపోయినదాన్ని గతంగా
కనులముందు కదిలేదాన్ని వర్తమానంగా
రాబోవుదాన్ని భవిష్యత్తుగా మీరు నామకరణం
చేయడం తప్ప...
తరతమ బేధాలను అసలెరుగను…
రాజైనా… బంటైనా… రాచ మర్యాదలే…
మంచి చెడులను పోగేసుకుని కదిలి
పోవడమే నాకు తెలిసిన న్యాయం ….
మధురమైన తీపి జ్ఞాపకాలకు…
సంతోషాల సరదాల ఆనందాలకు… పొంగక
విపత్తులను విధ్వంసాలను చూచినా…
దుఃఖ సాగరాలను దాటుకుంటూ వచ్చే…
స్థిత ప్రజ్ఞురాలిని….
అధికారాలను అవమానాలను
అలంకరించుకుని...
దౌర్జన్యాలను దోపిడీలను మూటకట్టుకుని
దేవ దానవ చర్యలుగా విభజించుకుంటూ….
చరిత్రలుగా చిత్రీకరించుకుంటూ …..
పుటలను మాత్రం నింపుకుంటున్నాను…
No comments:
Post a Comment