చిత్రకవిత
CHILD SLEEPING ON BUFFALO
తేది : 09-01-2022
శీర్షిక : ఆగర్భ శ్రీమంతుడే ...
కవిత సంఖ్య 198
ఆకలి దప్పుల అవసరములు
కష్ట సుఖాల కారణములు
సుఖ దుఃఖాల సూత్రములు
పట్టని బాలా బోలా తనము ......
పట్టుపరుపుల చుట్టం కాదు
ఇల్లువాకిళ్ళ ఇలవేల్పు లేదు
కూర్చుండ కుదురైన ఆసనం
లేకున్నా .... కుదురైన మహిషం
వీపే పట్టు పాన్పులై జోల పాడుచుండె .... .
ఆలోచనల గుఱ్ఱములను ఆవలకు
పారద్రోలి....చీకు చింతల జోలి లేక
పచ్చిక లోన మచ్చిక చేసుకుని
మహిషమునెక్కి పరుండే పాపడు ....
డొక్కలన్నీ బిక్కచచ్చినా
ఒల్లంతటినీ ఒక్క లాగుతోనే
కప్పుకున్నా ... విశాల విశ్వంలో
సుందర దృశ్యంగా చిత్రించాడు ....
అత్యవసరాల ఆరాటం లేదు
నిత్యావసరాల గొడవల్లేవు
సౌకర్యాల సందడి లేదు .... అయినా
ఆగర్భ శ్రీమంతుడే అతడు .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment